Live Updates

Rajamouli Tells About Mahesh Film

Mahesh Babu
మొన్న బిజినెస్ మ్యాన్ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి త్వరలో మహేష్ తో సినిమా చేస్తానని ఎలాంటి సినిమా కావాలో కోరుకొమ్మని అబిమానులను అడిగిన సంగతి తెలిసిందే. అంతేగాక అల్లూరి సీతారామరాజు లాంటి సినిమా కావాలా అని కూడా క్లూ ఇచ్చారు. దానికి ఆయన ట్విట్టర్ లో చాలా సమాధానాలు వచ్చాయి. అయితే ఎవ్వరూ అల్లూరి సీతారామరాజు లాంటి కథను కోరుకోలేదు. వాళ్ళంతా జేమ్స్ బాండ్ లాంటి స్టైలిష్ ఏక్షన్ ఎంటర్టైనర్ కోరుకున్నారు. అంతేగాక మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాను వారు అడగటం జరిగింది. ఇదంతా చదివిన రాజమౌళి ఏమని రిప్లై ఇచ్చాడంటే... అల్లూరి సీతారామరాజు కథను రీమేక్ చేయటానికి ఎవరూ సముఖత చూపించలేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను చెయ్యాలనుకోకపోయినా జనాల అనాసక్తి చూసి చాలా బాద అనిపించింది. జేమ్స్ బాండ్ మన చరిత్రను కూడా దాటేస్తున్నాడు.

ఇది కేవలం సినిమాలకే పరిమితం అవ్వాలనుకుంటున్నాను. అంతేగాక... తను మిషన్ ఇంపాజిబుల్ లాంటి సినిమాలను చేయబోనని అన్నారు. అలాగే తనికి అలాంటి స్టైలిష్ ఎంటర్టైనర్ చెయ్యటానికి ఆసక్తి లేదనటానికి కారణం.. స్టైలిష్ ఫిల్మ్స్ చెయ్యాలంటే బాండ్, మిషన్ ఇంపాజిబుల్,ట్రాన్స్ పోర్టర్ సిరీస్ తో మిగతా హాలీవుడ్ సినిమాలతో కలిపి ఒక సినిమా చెయ్యాల్సి వస్తుందని అన్నారు. కాబట్టి తను కేవలం భావోద్వేగాలతో ఊగిసలాడే సినిమాలను మాత్రమే చేస్తానని, అదే తన బలం అని అన్నాడు. అంతేగాక తను ఎంత ట్రై చేసినా ఆ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ లా కలల్లో కూడా అలాంటి సినిమాలు చెయ్యదలుచుకోలేనని అన్నారు. అలాంటి సినిమాలు ఆడియన్స్ చూసిన తర్వాత మన సినిమాతో నిరుత్సాహపడతారని చెప్పుకొచ్చాడు. అయితే తాను ఎప్పుడు సబ్జెక్టు ఎంపిక చేసుకున్నా ధియోటర్లో కూర్చుని చూసే ప్రేక్షకుడ్ని నిరుత్సాహపరచనని ప్రామిస్ చేసాడు.

Share this

Related Posts

Previous
Next Post »